చాలా మందికి కేరళ అదీ మున్నార్,అలెప్పీ వెళ్ళటం అనేది డ్రీమ్
ఎలా వెళ్లాలి అక్కడ ఏం చూడాలి అనేదానికి ఈ పోస్ట్..
మున్నార్ ఎలా వెళ్లాలి?
రెండు మార్గాలు ఒకటి ట్రైన్ రెండు కార్/బస్
ట్రైన్ అయితే Aluwa అనే స్టేషన్ కి టికెట్ తీసుకోండి స్టేషన్ బయటకు రాగానే మున్నార్ కి నంబర్ ఆఫ్ బస్సెస్, కమాండర్ జీప్ లు ఉంటాయి.Aluwa నుండి మున్నార్ వెళ్ళే రోడ్ అయితే పిచ్చి ఎక్కిస్తుంది.ఆ రోడ్ లో ఆ డ్రైవర్ లు చేసే విన్యాసాలకు తోడు దూరంగా మేఘాలు,జలపాతాలు అసలు దేన్నీ చూడాలో దేన్నీ వదిలేయాలో అర్థం కాని కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి మున్నార్ అందాలను చూడటానికి మానసికంగా ప్రిపేర్ చేస్తుంది ఈ రోడ్..
బస్సు లేదా కార్ లో వెళ్ళే వాళ్లు అయితే మదురై మీదుగా వెళ్తే తక్కువ దూరం తో చేరుకోగలరు.ఆ రూట్ లో మరిన్ని చూడదగ్గ ప్రదేశాలు ఉంటాయి కాబట్టి లేదు అంటే మీ ఇష్టం ఎలా వెళ్ళినా ఒకే కానీ Theni మీదుగా నేను వెళ్లాను Theni దాటగానే మున్నార్ వాతావరణం స్టార్ట్ అయ్యి చలి స్వాగతం పలుగుతుంది…
నా సలహా అయితే Train కి వెళ్ళండి అప్పుడే డ్రైవింగ్ సమస్య లేకుండా పూర్తీగా ఎంజాయ్ చేయవచ్చు. హిల్ స్టేషన్ లో పెద్దగా ఇబ్బందులు పడరు.దాదాపు ప్రతీ ఆటో డ్రైవర్ కి అక్కడ ఒక చిన్న రిసార్ట్ మరొక కమాండర్ జీపు ఉంటుంది కాబట్టి రెండూ కలిసి మాట్లాడుకోవచ్చు.
రూం అయితే తక్కువ లో కావాలి అంటే 900 నుండి దొరుకుతాయి మెయింటనేన్స్ విషయం లో రాజీ ఉండదు మున్నార్ లో ఏ హోటల్ అయినా సరే. హయ్యస్ట్ అంటే ఇక గార్డెన్ వ్యూ రూమ్స్, సర్వీస్ ఇలా కేటగిరీ బట్టి రోజుకు 6,000 ఛార్జ్ చేసే హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.మున్నార్ టౌన్ లోనే స్టే చేయాలి అనే పట్టింపు లేకపోతే చుట్టూ పది కిలోమీటర్ల లోపు ఎక్కడైనా ఉండచ్చు బడ్జెట్ బట్టి.
ఇక సైట్ సీ కోసం 700-900 రోజుకు ఒక మనిషికి ఛార్జ్ చేసి మున్నార్ తిప్పుతారు.కనీసం మూడు రోజులు ప్లాన్ చేసుకోవటం బెస్ట్.ఫుడ్ కాస్ట్ మాత్రం బాగా ఎక్కువే ఉంటుంది.ప్రతీ హోటల్ లో వెజ్,నాన్ వెజ్ దొరుకుతాయి కేరళ స్పెషల్స్ ట్రై చేయండి బాగుంటాయి.నీళ్ళలో అదేదో ఎర్ర కలర్ వేసి ఇస్తారు ఆయుర్వేదం అంట స్కిన్ కేర్ కోసం బాగుంటాయి దాదాపు అన్ని హోటల్స్ లో తాగు నీరు గా మినరల్ వాటర్ ఇస్తారు అదీ వేడి వేడిగా మన దగ్గర లాగా సపరేట్ గా బాటిల్స్ కి డబ్బులు నూకరు..
ఇప్పుడైతే వర్షాకాలం అంత బాగా చూడలేము మీకు వర్షం ఇష్టం అయితే ఇప్పుడు వెళ్లండి లేదంటే అక్టోబర్ నుండి జనవరి మధ్య ప్లాన్ చేసుకోండి చాలా చాలా ఎంజాయ్ చేస్తారు.ఒంటరిగా కాకుండా ఫ్రెండ్స్ తో వెళ్లండి లైఫ్ లో బెస్ట్ టైం గా మిగులుతుంది మీకు. ఇక పోతే చివరగా భాషా సమస్యలు మళయాలం అనగానే అదో భయం ఉంటుంది.కానీ ఆ భయం అస్సలు వద్దు.అక్కడ ఆటో డ్రైవర్ కూడా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు సో మీ ట్రిప్ చాలా అద్భుతంగా సాగటం లో వీరు సహాయపడతారు..త్వరలో మీకు హెల్ప్ అవ్వటానికి నేను అక్కడ ఉంటాను.మీరు ఏ క్యాబ్ ఎక్కినా మాటల మధ్యలో అల్లు అర్జున్ పేరు చెప్పండి నేను చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పండి అక్కడి వాళ్ళు మీకు మరింత ఎక్కువ కనెక్ట్ అవుతారు..