December 22, 2024

తెలంగాణ మంత్రులను కలిసిన మంద కృష్ణ మాదిగ

తెలంగాణ మంత్రులను కలిసిన మంద కృష్ణ మాదిగ

తెలంగాణ మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారిని మరియు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని కలిసిన శ్రీ మంద కృష్ణ మాదిగ గారు, దామోదర్ రాజనర్సింహ గారు, మాదిగ ప్రజా ప్రతినిధులు….

ఎస్సీ వర్గీకరణకు సహకరించాలని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెనువెంటనే ఎస్సీ వర్గీకరణను అమలులోకి ప్రభుత్వం తీసుకొచ్చేలా చూడాలని కోరుతూ రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి అలాగే రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు అలాగే మాదిగ ప్రజాప్రతిని ప్రజా ప్రతినిధుల బృందం కోరింది.

ఈ విజ్ఞప్తిపై మంత్రులు సానుకూలంగా స్పందించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ,మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నర్సింహులు గారు, వేముల వీరేశం గారు, కాలే యాదయ్య గారు, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, తోట లక్ష్మీ కాంతారావు గారు, మందుల సామెల్ , మాజీ ఎంపీ పసునూరి దయాకర్ గారు అలాగే ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ ఓయు ప్రొఫెసర్ గడ్డం మల్లేష్ కాంగ్రెస్ నేతలు విజయ్ కుమార్ , కొండేటి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు,

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి -( MRPS)

గోవిందు నరేష్ మాదిగ
MRPS రాష్ట్ర అధ్యక్షులు.

Related Post