December 23, 2024

తెలంగాణ మాజీ సీఎస్‌ సోమేష్‌కుమార్‌‌పై కేసు నమోదు, వాణిజ్య పన్నుల శాఖ‌లో అక్రమాలే కారణం

తెలంగాణ మాజీ సీఎస్‌ సోమేష్‌కుమార్‌‌పై కేసు నమోదు, వాణిజ్య పన్నుల శాఖ‌లో అక్రమాలే కారణం

తెలంగాణ మాజీ సీఎస్‌ సోమేష్‌ కుమార్‌పై కేసు నమోదైంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేష్ కుమార్‌ కోర్టు తీర్పుతో ఏపీకి వెళ్లి ఆపై స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.

వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ చెల్లింపుల్లో దాదాపు రూ.1000 కోట్ల మేరకు అక్రమాలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 75 కంపెనీలు అవకతవకలకు పాల్పడినట్లు ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో వెల్లడైంది. తెలంగాణ కమర్షియల్‌ టాక్స్‌ కమిషనర్‌ రవి ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు దర్యాప్తులో ప్రాథమిక ఆధారాలు లభించడంతో మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో పాటు పలువురిపై సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కమర్షియల్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్ అడిషనల్‌ కమిషనర్‌, డిప్యూటీ కమిషనర్లపై కేసు నమోదైంది. నిందితులపై 406, 409, 120(బి) ఐటీ చట్టం కింద సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Related Post