రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆరుగురు కొత్త గవర్నర్లను నియమించారు. మరో ముగ్గురిని పునర్వ్యవస్థీకరించారు. ఈ మేరకు శనివారం రాత్రి రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయా కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించే తేదీల నుంచి ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి తెలిపింది.
అసోం, మణిపూర్
అదనపు బాధ్యతలతో లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అసోం గవర్నర్‌గా రాష్ట్రపతి నియమించారు. గత ఏడాది ఫిబ్రవరి నుంచి మణిపూర్ గవర్నర్‌గా పనిచేస్తున్న అనుసూయ ఉక్యే స్థానంలో ఆయన నియమితులయ్యారు. సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అసోం గవర్నర్‌గా నియమించారని, మణిపూర్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారని రాష్ట్రపతి భవన్ ప్రకటనలో పేర్కొన్నారు
పంజబ్..
రాష్ట్రపతి భవన్ ప్రకటించిన గవర్నర్ నియామకాల కింద పంజాబ్ గవర్నర్‌గా పనిచేసిన బన్వరిలాల్ పురోహిత్ స్థానంలో గులాబ్ చంద్ కటారియా నియమితులయ్యారు. పంజాబ్ గవర్నర్, ఛండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ బన్వరిలాల్ పురోహిత్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.
లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య స్థానంలో కేంద్రపాలిత ప్రాంతమైన ఛండీగఢ్ అడ్మినిస్ట్రేటర్‌గా గులాబ్ చంద్ కటారియాను నియమించారు.
సిక్కిం..
తాజా నియామకాల ప్రకారం సిక్కిం కొత్త గవర్నర్‌గా బీజేపీ సీనియర్ నేత ఓం ప్రకాశ్ మాథుర్ నియమితులయ్యారు.
మహారాష్ట్ర..
కొత్త గవర్నర్‌గా ఝార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్‌ను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న రమేష్ బైస్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. సీ.పీ.రాధాకృష్ణన్ ఇప్పటివరకు తెలంగాణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఝార్ఖండ్
ఝార్ఖండ్ గవర్నర్‌గా రాధాకృష్ణన్ స్థానంలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ బాధ్యతలు చేపట్టనున్నారు.
తెలంగాణ
త్రిపుర మాజీ ఉపముఖ్యమంత్రి జిష్ణు దేవ్ వర్మను తెలంగాణ కొత్త గవర్నర్‌గా నియమించారు.
పుదుచ్చేరి
ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత నమ్మకస్తుల్లో ఒకరైన మాజీ ఐఏఎస్ అధికారి కె.కైలాసనాథన్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు.
కైలాసనాథన్ గతంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత దశాబ్దానికి పైగా ఈ పదవిలో కొనసాగిన ఆయన ఎట్టకేలకు జూన్ 30న పదవి నుంచి వైదొలిగారు.
రాజస్థాన్
గవర్నర్ కల్రాజ్ మిశ్రా స్థానంలో మహారాష్ట్రకు చెందిన బీజేపీ సీనియర్ నేత హరిభావ్ కిసాన్ రావ్ బాగ్డే నియమితులయ్యారు.
ఛత్తీస్‌గఢ్
ఛత్తీస్‌గఢ్ గవర్నర్ పదవిని అసోంకు చెందిన మాజీ లోక్ సభ సభ్యుడు రామెన్ డేకా చేపట్టనున్నారు.
మేఘాలయ
కర్ణాటకలోని మైసూరుకు చెందిన మాజీ లోక్‌సభ సభ్యుడు సీహెచ్ విజయశంకర్ మేఘాలయ గవర్నర్‌గా వ్యవహరిస్తారు.