77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 50 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పార్టీ పాలించింది.
కాంగ్రెస్ పాలన సమయంలో దేశంలో వేలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
2014 వరకు వ్యవసాయం కోసం కాంగ్రెస్ చేసిందేమీ లేదు.
స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు.
నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2014-15 లో 1360 రూపాయలున్న కనీస మద్దతు ధర.. ఈరోజు 2320 రూపాయలు ఉంది. స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ను అమలు చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం.
సహజ సిద్ధమైన వ్యవసాయం ద్వారా దిగుబడి తగ్గుతుండవచ్చు కానీ..
క్యాన్సర్లు, కిడ్నీ రోగాలు రాకుండా ఉండాలని మోడీ గారి సర్కార్ ఈ ఆలోచన చేస్తుంది. డబ్బుల కోసం కాదు ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచన చేస్తుంది. సహజసిద్ధమైన వ్యవసాయం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మనం సంపూర్ణంగా స్వాగతించాలి.
సోషల్ జస్టిస్ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది.
తెలంగాణలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక దళితుడు గాని, గిరిజనుడు కానీ, ఓబీసీ కానీ ముఖ్యమంత్రి కాలేదు.
2014లో, 2019 లో కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటులో అపోజిషన్ పార్టీ గౌరవం కూడా దక్కలేదు.. అప్పుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉండలేదు. కానీ ఈసారి ప్రతిపక్ష హోదా రాగానే రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఎన్నుకోబడ్డారు.
కానీ భారతీయ జనతా పార్టీ ఒక ఓబీసీని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది.
వాజపేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రపతిగా.. అబ్దుల్ కలాం గారిని నియమించారు.
2014లో మోడీ గారి హయాంలో ఒక దళిత బిడ్డను..
రెండవసారి ఒక ఆదివాసి అడవి బిడ్డను రాష్ట్రపతిగా చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఆ ఆలోచన కూడా చేయలేదు.
దళిత జాతి గురించి కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు.
గత NDA ప్రభుత్వ మంత్రివర్గంలో 12 మంది దళితులు, ఎనిమిది మంది ఎస్టీలు, 27 మంది ఓబీసీలు మంత్రులుగా ఉన్నారు.
ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీల గురించి ఆలోచన చేసిన ఏకైక పార్టీ బిజెపి.
12 కోట్ల టాయిలెట్లు కట్టించి ఆడవారి ఆత్మగౌరవని కాపాడిన వ్యక్తి మోడీ..
ఈ పని కాంగ్రెస్ చేయలేదు.
ఈ బడ్జెట్లో ఇన్నేళ్ల తర్వాత నిరుద్యోగుల కోసం ఆలోచన చేసి.. శిక్షణ ఇవ్వాలంటూ దానికి నిధులు కేటాయించడం స్వాగతించాల్సిన విషయం.
భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఉంది.
అమెరికా సైతం ఈ సమస్యను ఎదుర్కొంటుంది.
ప్రపంచం ఆర్థిక మాంద్యంతో సతమతమవుతుంది.
భారతదేశం యువశక్తి ఉన్న దేశం. ఆ యువశక్తిని ప్రోడక్టివిటీ దిశగా మలచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిధులు కేటాయించారు. ఇది అమలు చేస్తే
అయిదవ ఆర్థిక శక్తిగా ఉన్న భారతదేశం మూడవ ఆర్థికశక్తిగా మారనుంది.
ఈ బడ్జెట్ ప్రజల బడ్జెట్ కాదని, పనికొచ్చే బడ్జెట్ కాదని, అపోజిషన్ పార్టీలు ఉన్న రాష్ట్రాలకు నిధులు కేటాయించలేదని చేస్తున్న ఆరోపణలన్ని నిరాధారమైనవి అంటూ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.