భారత ప్రధాని గౌ. శ్రీ నరేంద్ర మోడీ గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన MRPS అధినేత మంద కృష్ణ మాదిగ గారు…..
ఈ సందర్బంగా ఆత్మీయంగా మంద కృష్ణ మాదిగ గారిని ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపిన గౌ. శ్రీ నరేంద్ర మోడీ గారు….
మాదిగ జాతి చిరకాల ఆకాంక్ష, మూడు దశాబ్ధాల ఉద్యమ ఆశయం, సామజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనమైన ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ఉద్యమం విజయవంతం కావడానికి కేంద్ర ప్రభుత్వం తరుపున అన్ని విధాల అండగా నిలిచిన భారతదేశ ప్రధానమంత్రి గౌ .శ్రీ నరేంద్ర మోడీ గారికి MRPS అధినేత మంద కృష్ణ మాదిగ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్బంగా ప్రధానమంత్రి గారు మంద కృష్ణ మాదిగ గారిని ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. మాదిగ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరిందుకు మోడీ గారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
శ్రీ నరేంద్ర మోడీ గారు ఎంతో అనురాగంతో,ఆప్యాయంగా, ఆత్మీయంగా పలకరించి శ్రీ మంద కృష్ణ మాదిగ గారి ఎడల, అలాగే MRPS ఉద్యమం పట్ల మరియు మాదిగ జాతి ఎడల తన ఉన్నకున్న ప్రేమను వ్యక్తపరిచారు.
ప్రధానమంత్రి గారు తన ఛాంబర్ లో మంద కృష్ణ మాదిగ గారిని కూర్చోబెట్టుకొని కూలంకషంగా అనేక విషయాలు మాట్లాడం జరిగింది.