బండి సంజయ్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి రాక
అనంతరం పలు దేవాలయాల సందర్శన
బోనాల పండుగను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడతారు. అక్కడి నుండి బేలా లోని బంగారు మైసమ్మ, హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయం, లాల్ దర్వాజ ముత్యాలమ్మ, గౌలీపురాలోని భారతమాత, ఉప్పుగూడలోని మహంకాళి, అలియాబాద్ లోని దర్బార్ మైసమ్మ, మేకలబండలోని నల్లపోచమ్మ, దూద్ బౌలిలోని కాలభైరవి, కార్వాన్ లోని దర్బార్ మైసమ్మ ఆలయాలను సందర్శించి పూజలు నిర్వహిస్తారు..