December 23, 2024

రైతులకు రుణమాఫీ అమలు అయ్యేలా చర్యలు. జిల్లా పాలనాధికారి.

రైతులకు రుణమాఫీ అమలు అయ్యేలా చర్యలు. జిల్లా పాలనాధికారి.

ప్రతి రైతుకు రుణమాఫీ ఫలాలు అందేలా కట్టుదిట్టమైన చర్యలు… జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

*ఫిర్యాదుల నమోదుకు 18005995459 టోల్ ఫ్రీ నెంబర్ తో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

*12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు తీసుకున్న రుణాలు, రెన్యువల్స్ మాఫీ

*ప్రతి కుటుంబం ప్రామాణికంగా 2 లక్షల వరకు రుణమాఫీ వర్తింపు

*సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా జరిగిన రైతు రుణమాఫీ రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, జూలై -30:

లక్షన్నర వరకు రుణాలు ఉన్న రైతులకు రెండవ విడత కింద ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ నిధులు చేరి , రుణమాఫీ ఫలాలు మన జిల్లాలోని రైతులకు వర్తించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.

మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర అసెంబ్లీ నుంచి శాసన మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రివర్యులు, శాసనసభ సభ్యులు , రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి రైతు రుణమాఫీ మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

రైతు రుణమాఫీ రెండవ విడత నిధుల విడుదల కింద లక్షన్నర వరకు రుణాలు ఉన్న 6 లక్షల 40 వేల మంది రైతులకు సంబంధించి 6 వేల 190 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. అనంతరం రైతులను ఉద్దేశించి ముఖ్యమంత్రి తన సందేశాన్ని అందజేశారు.

రెండవ విడత రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించిన తర్వాత జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, రెండు విడుదల లో కలిపి మన జిల్లాలో మొత్తం 42 వేల 965 మంది రైతులకు 271 కోట్ల రుణమాఫీ సొమ్ము ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. మొదటి విడత కింద లక్ష రూపాయల వరకు రుణమాఫీ జరిగిన 29 వేల 725 రైతులలో దాదాపు 85% మేర రుణాలు రెన్యువల్ చేసి రైతుల ఖాతాలలో నిధులు తమ చేసి రుణమాఫీ ఫలాలు రైతులకు అందించామని కలెక్టర్ పేర్కొన్నారు.

రెండో విడత లక్షన్నర రుణమాఫీ కింద మన జిల్లాలో ఉన్న 13 వేలకు పైగా రైతులకు 122 కోట్లపైగా నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని, వీటిని సైతం వచ్చే వారం రోజులలో రైతులకు పూర్తి స్థాయిలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామని, రైతుల రుణాలు రెన్యువల్ చేసి రుణమాఫీ ఫలాలు రైతులకు అందేలా బ్యాంకర్లు వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

రుణమాఫీ పథకం పై రైతులు ఫిర్యాదులను నమోదు చేస్తే 30 రోజులలో పరిష్కరించడం జరుగుతుందని, మన జిల్లాలో ఫిర్యాదుల నమోదు కోసం ప్రత్యేకంగా జిల్లా కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్ సైతం ఏర్పాటు చేశామని, రుణమాఫీ పథకంపై రైతులు తమ సందేహాలను 18005995459 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు.

రేషన్ కార్డు రైతు రుణమాఫీ పథకం అమలుకు తప్పనిసరి కాదని, రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు ఒక ప్రామాణికంగా మాత్రమే రేషన్ కార్డును వినియోగిస్తున్నామని, భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ పథకం అమలు అవుతుందని అన్నారు.

12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు రైతులు నూతనంగా తీసుకున్న రుణాలు, రెన్యువల్ చేసుకున్న రుణాలు అసలు, వడ్డీ కలిపి 2 లక్షల రూపాయల వరకు ప్రతి రైతు కుటుంబానికి మాఫీ జరుగుతుందని, రైతు కుటుంబానికి రెండు లక్షల కంటే అధికంగా రుణం ఉన్నట్లయితే కుటుంబంలోని మహిళ పేరు పై రుణాలు నిబంధనల మేరకు ముందుగా మాఫీ అవుతాయని కలెక్టర్ పేర్కొన్నారు.

అనంతరం రుణమాఫీ సందర్భంగా రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, ఎల్.డి.ఎం.వెంకటేష్, బ్యాంకర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related Post