కార్మిక కుటుంబాల కోసం అండగా రామగుండం లో కేంద్రం తలపెట్టిన ESI ఆసుపత్రి కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే భూమిని కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చిన రామగుండం బీజేపీ ఇంచార్జ్ కందుల సంధ్యా రాణి
2018 లో కేంద్ర ప్రభుత్వం రామగుండంలో కార్మికుల కోసం ESI ఆసుపత్రి కై 100కోట్లు శాంక్షన్ చేసినా కేవలం భూమి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుంది.
గత ప్రభుత్వం ఇలాగే మీనమేషాలు లెక్కించింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయినా ఎలాంటి ఆతీ గతీ లేదు. ఎన్ని సార్లు లేఖలు రాసిన స్పందన కరువు.
కార్మికులు, కార్మికుల కుటుంబాలు అనారోగ్యానికి, ప్రమాదానికి గురి అయినప్పుడు హైదరబాద్ ESI హాస్పిటల్ కి వెళ్ళలేక ఇక్కడే డబ్బులు ఖర్చు పెట్టుకోవడమో అత్యవసరం అయితే మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోవడమో జరుగుతుంది.
ఇది ఒక సంస్థ కార్మికులకు సంబంధించిన అవసరం కాదు.. పారిశ్రామిక ప్రాంతం అయిన రామగుండంలో NTPC, సింగరేణి, RFCL, కేశొరాం సిమెంట్ లాంటి భారీ పరిశ్రమలలో పని చేస్తున్న కార్మికుల అందరి ఆవేదన.
అసెంబ్లీ, పార్లిమెంట్ ఎన్నికల్లో ప్రలోభ మాటలు హామీలుగా ఇచ్చి ఇప్పుడు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారు ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులు. కార్మికులారా.. కార్మిక నాయకుల్లారా..
పార్టీలకు అతీతంగా రండి. మీ కుటుంబాల కోసం చేస్తున్న పోరాటంలో భాగం అవ్వండి. రాష్ట్ర నాయకత్వ అలసత్వాన్ని ఎండగట్టి అత్యాధునిక ESI హాస్పిటల్ సాధించుకుందామంటూ కందుల సంధ్యారాణి పిలుపునిచ్చారు