రామగుండం నియోజకవర్గం బసంత నగర్ సమీపంలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పైన గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిన రోడ్డును ప్రారంభించకుండా కాలయాపన చేస్తున్న ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు వెంటనే రోడ్డును ప్రారంభించాలని, బి.ఆర్.ఎస్. రాష్ట్ర నాయకులు కౌశిక హరి డిమాండ్ చేశారు.
గత వారం రోజుల క్రితం బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక హరి అక్కడి రోడ్డును పరిశీలించి మైసమ్మ టెంపుల్ వద్ద తన కార్యకర్తలతో కొబ్బరికాయలు కొట్టి మాట్లాడడం జరిగింది, ఎన్నో సంవత్సరాల కిందట సింగిల్ రోడ్ లో ప్రమాదాలు చాలా జరుగుతున్నాయని, గతంలో ఆర్టీసీ బస్సు కూడా రోడ్డు పక్కన లోయలో పడిపోవడం జరిగిందని తెలిపారు.
పలుమార్లు లారీలు కార్లు ప్రమాదాల గురికావడం జరిగిందని ప్రమాదాలు జరగకుండా అక్కడ మైసమ్మ గుడి నిర్మించినప్పటినుండి కొంత ప్రమాదాలు తగ్గినప్పటికీ, ఈ రాజీవ్ రహదారి పై నుండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాహనాలతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ , ఛత్తీస్ గడ్ తదితర ప్రాంత వాహనాలతో రద్దీీగా ఉంటుందని, ఇట్టి రోడ్డు పై వాహనాలు పెరగడంతో సరిపోవడం లేదని గత ప్రభుత్వం రోడ్డు నిర్మించి పూర్తి చేయడం జరిగిందని అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్ లో ప్రారంభం చేయలేకపోయారని కానీ ఇప్పుడు గెలిచిన ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారు అనుకుంటే ఇప్పటివరకు ప్రారంభించలేదని ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉందని ఏదైనా పెద్ద ప్రమాదం జరగకముందే రోడ్డు ప్రారంభించాలని ప్రజలు మరియు కార్యకర్తలతో రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్దకు వెళుతుంటే కౌశిక హరి నీ హౌస్ అరెస్ట్ చేయడం, ఈ అరెస్టు నిరసిస్తూ కార్యకర్తలు ప్రజలు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకొని ప్రజల సౌకర్యార్థం రోడ్డును వెంటనే ప్రారంభించాలని నిరసన తెలిపేందుకు వెళుతుంటే కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అసలు ఆ రోడ్డుపై నుండి వాహనాలు వెళ్లనివ్వడం లేదని నిరసన తెలుపుతుంటే వాహనాలను అడ్డుకుంటున్నారని అరెస్టు చేయడం ఎంతవరకు సబబు అని కౌశిక హరి అన్నారు.